భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

‘పారదర్శక పాలనకు ఆర్టీఐ చట్టం కీలకం’

WhatsApp Image 2025-11-29 at 3.51.01 PM

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ప్రజలకు పారదర్శక పాలన అందించడంలో సమాచార హక్కు చట్టం (RTI) కీలకపాత్ర వహిస్తుందని కర్నూలులోని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఆర్టీఐ దోహదపడుతుందని, ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవాలని వక్తలు సూచించారు.

అడ్వకేట్ రవికుమార్ దరఖాస్తు విధానాన్ని వివరించారు. లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ చట్టాన్ని వినియోగించుకోవచ్చని, పారదర్శకత పెరిగితే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని అన్నారు. యువత అవగాహన పెంచుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి కోరారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.