భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జాతీయ స్థాయిలో విశిష్ట సేవలు అందించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక జాతీయ గోపాల్ రత్న అవార్డు–2025 ను అందుకున్న నంద్యాల 15వ వార్డు రెవెన్యూ క్వార్టర్స్‌కు చెందిన చాకలి అనురాధను టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ ప్రత్యేకంగా ఆమె నివాసంలో సందర్శించి అభినందించారు. ఉత్తమ కృత్రిమ గర్భధారణ టెక్నీషియన్ విభాగంలో తృతీయ స్థానం సాధించిన అనురాధా గారి కృషి పశుసంవర్ధక రంగానికి ప్రతిష్ఠత తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళ జాతీయ స్థాయిలో ఇంత పెద్ద గుర్తింపు పొందడం ఇతర యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె సేవాభావం, నిబద్ధతే ఈ ప్రత్యేక పురస్కారం రావడానికి కారణమని ఫయాజ్ అభినందించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు వేణు, ఎబినైజర్, నాగేశ్వరరావు, రమేష్ పాల్, కామిని మల్లికార్జున, కరీం, అడ్వకేట్ ఖలీల్, దీపక్ రెడ్డి, బుగ్గ రాముడు, ఉప్పరి సురేష్ కుమార్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
30, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్