భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: శ్రీ లలిత సేవా సమితి ఆధ్వర్యంలో, దేవి ఉపాసకుల సమక్షంలో, యజ్ఞకర్త బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్ర శర్మ నేతృత్వంలో 1300వ చండీయాగం సిద్ధిపేటలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మహాయాగం స్థానిక భక్తుడు శ్రీ రవీందర్ నివాసంలో శాస్త్రోక్త పద్ధతుల్లో నిర్వహించారు. ఉదయం పుణ్యకాళంలో ప్రారంభమైన యాగం వేదఘోషాల మధ్య వైదిక పండితులు మంత్రోచ్చారణలతో కార్యక్రమాన్ని మహోత్సాహంగా కొనసాగించారు. చండీపాఠాలు, హోమాలు, ప్రత్యేక పూజలు, లలితా త్రిపురసుందరి అమ్మవారి ఆలాపనలు కార్యక్రమానికి మరింత ఆధ్యాత్మికతను చేకూర్చాయి. భక్తజనులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. యాగం అనంతరం బ్రహ్మశ్రీ రవీంద్ర శర్మ అశీర్వాచనాలు అందించారు. చండీయాగం సామూహిక శ్రేయస్సును, శాంతి సమృద్ధులను ప్రసాదిస్తుందని అన్నారు. 1300వ యాగం విజయవంతంగా జరగడం దేవీ కృప అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలిత సేవా సమితి సభ్యులు, స్థానిక భక్తులు భారీగా హాజరై యాగం విజయవంతం కావడానికి సహకరించారు. ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
BHARATH SAMACHAR DIGITAL
1, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్