భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

చదువుతో పాటు క్రీడలు ముఖ్యం: ఎమ్మెల్యే

WhatsApp Image 2025-12-01 at 5.25.22 PM

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో 4వ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటితరం యువత మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ వంటి వాటికి బానిసలు కాకుండా క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పటాన్‌చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. విజేతలకు తన సొంత నిధుల నుంచి రెండు లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేశారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని, పటాన్‌చెరులో మైత్రి స్టేడియాన్ని ఆధునికరించామని తెలిపారు. క్రీడా పోటీల నిర్వహకురాలు ఇంటూరి రేఖను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.