భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే గ్రామల అభివృద్ధి సాధ్యం

5

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని సోమవారం గ్రామ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 50 మంది యువకులు పార్టీలో చేరారు. గోవర్ధన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి మార్గంలో పయనించాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కొనసాగాలంటే గ్రామాల్లో బీఆర్ఎస్ శక్తి మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నమ్మకంతోనే పార్టీలో చేరికలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నక్క వెంకటేష్ గౌడ్, సర్పంచ్ అభ్యర్థి యాదిగిరి యాదవ్, ముదిరికాచారి, విశాల్ గౌడ్ భార్గవ్ చారి, శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణారెడ్డి,బాల్ రెడ్డి, నాగులు,వెంకటేష్, కాంతారావు, రాజు, యాదగిరి, రాహుల్ యాదవ్, జనార్ధన్, బన్నీ, శేఖర్, ఆసిఫ్, నాయకులు,యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.