భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

WhatsApp Image 2025-12-03 at 8.09.41 PM

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మోమిన్ హుస్సేన్ సాహెబ్ 34వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయన మనవడు, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి మోమిన్ మునీర్ భాష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి ఎం.ఏ. రషీద్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం 66 ఏళ్ల పాటు ఆయన గ్రామ పాలనలో అందించిన విశేష సేవలను గుర్తుచేశారు. మునీర్ భాష ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌బీసీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బైరాపురం మహబూబ్ బాషా, ఎన్.ఎస్. రఫిక్, శీను తదితరులు పాల్గొన్నారు.