భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని అన్నారు. పటాన్‌చెరు డివిజన్‌కు చెందిన ముంతాజ్ బేగం అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె దరఖాస్తు మేరకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 5 లక్షల విలువైన ఎల్వోసీ ఎమ్మెల్యే శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
6, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్