భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ఏదుల గ్రామంలో గత 60 సంవత్సరాలుగా ఇక్కడ బీసీ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ యాదవ సామాజిక వర్గం నుంచి ఒక్కరంటే ఒక్కరూ కూడా సర్పంచుగా పని చేయలేదు. తాజాగా జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించాడు. కాటమోని పరుశురాం యాదవ్ ఏదుల గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ కాటమోని పరశురామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి, యువతకు తొలి ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
BHARATH SAMACHAR DIGITAL
13, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్