భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పెద్ద శంకరం పేట మండలం 161వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన లింగమయ్యా (భర్త), సాయమ్మ (భార్య), వారి కొడుకు సాయి, కూతురు మనసాగా గుర్తించారు. వీరు ఓటు వేయడానికి హైదరాబాద్ లింగంపల్లి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.