భారత్ సమాచార్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వానికి కొత్త నిర్వచనం ఇస్తూ ఉత్తరాంధ్రలో యువ రక్తం ఉరకలు వేస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రెండ్‌కు బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష తెరలేపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి మోసాలను ఎండగట్టేందుకు పార్టీ అధిష్ఠానం చేపట్టిన “కోటి సంతకాల సేకరణ” కార్యక్రమాన్ని బొత్స అనూష చీపురుపల్లి నియోజకవర్గంలో సునాయాసంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్కరితో కలివిడిగా మాట్లాడుతూ, కార్యకర్తలకు భరోసా నింపుతూ తండ్రికి తగ్గ వారసురాలిగా గుర్తింపు పొందారు. కేడర్ అంతా ఆమె నాయకత్వాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పీఠంపై కన్నేసిన ఉత్తరాంధ్ర నేతలు, 2028లో జరగబోయే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.