భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

అధికార పార్టీ సర్పంచులను గెలిపించాలి: తోట లక్ష్మీకాంతారావు

7ac21f0b-97eb-4a09-9990-a247da3abe72

భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతిపక్షాలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు అభివృద్ధికి దూరమవుతాయని గ్రామాల అభివృద్ధి కోసం కలిసి పని చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రభుత్వ పథకాలు సకాలంలో చేరుతాయని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీనే ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తుందన్న నమ్మకంతో అందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం, కొత్త అభివృద్ధి కార్యక్రమాల కోసం అధికార పార్టీకి మీ విలువైన ఓటు అవసరమని కోరారు. గ్రామాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని, సమర్థత కలిగిన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.