భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ ఎన్నికలు రెండవ విడత ఇటీవల జరిగిన విషయం విదితమే. అందులో భాగంగా నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ సీటును కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థి అభ్యర్థిపై, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధానావత్ వెంకట్రాం నాయక్ 328 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా త్రిపురారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్ల చంద్రారెడ్డి సుశీల దంపతులు మాటూరు గ్రామ సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్ ను, గెలుపునకు అశేషమైన కృషిచేసిన త్రిపురారం మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధానావత్ భాస్కర్ నాయక్ లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మర్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండలం కాంగ్రెస్ కు కంచుకోట అని, అందులోనూ మాటూరు ఓటర్లు కాంగ్రెస్ కు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని పేర్కొన్నారు. 2018 గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ను గెలిపించారని, ఈ ఎన్నికల్లో కూడా మరోమారు కాంగ్రెస్ ను గెలిపించి మరోసారి పార్టీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి దంపతులతోపాటు, మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధానావత్ భాస్కర్ నాయక్, మాటూరు గ్రామ సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
16, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్