భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

పాలకుల ఎంపికలో ఓటే వజ్రాయుధం: చిత్తలూరు శ్రీనివాస్

6dfe86e2-902a-453b-a465-1c1299859aed

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పాలకుల ఎంపికలో ఓటు వజ్రాయుధం వంటిదని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మానుకోట జిల్లా అధ్యక్షులు చిత్తలూరు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో జిల్లాలోని మండల కేంద్రం కురవి గ్రామపంచాయతీ ఎన్నికలలో ఆయన తన సతీమణి రమాదేవి, కూతురు దుర్గా భాస్కర్ లతో కలిసి బుధవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలకమైందన్నారు. ఎన్ని పనులున్నా ఐదేళ్ల కోసం తమ పాలకులను ఎన్నుకోవడానికి తరలివచ్చి ఓటు వేసి తమ బాధ్యతను నెరవేర్చుకోవాలన్నారు. ఓటుతోనే గ్రామాల భవిష్యత్తు ఆధారపడి ఉందని గ్రహించాలన్నారు. ఇందుకోసం ఎన్ని ప్రయాసలు పడినా ఆనందంగా స్వీకరించాలని సూచించారు.