భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

నాయకుల మధ్య ఘర్షణ.. పోగులపల్లిలో ఉద్రిక్తత

f0f88935-3207-43a6-95da-d5bcb10e319c

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఓటు వేసి వస్తుండగా కారు తాగిందని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగులపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం గొడవకు దారి తీసింది. ఓటు వేసి వస్తున్న క్రమంలో పోలింగ్ కేంద్రం బయట బీఆర్ఎస్ నాయకుల కారు తగిలిందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణ తారాస్థాయికి చేరి పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఉద్రిక్తత నెలకుంది. పోలీసులు వెంటనే చేరుకుని ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టి సర్ది చెప్పారు. ఘర్షణలో ఓ పార్టీకి చెందిన కార్యకర్త బంగారు గొలుసు పోయింది.