భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం, రాజకీయ ఉద్రిక్తతలను సృష్టించే చర్యలకు పాల్పడటం చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యలను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి హెచ్చరించారు. భవిష్యత్తులో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే, వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు రాజకీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఉద్దేశంతో మహబూబాబాద్ మాజీ డిసిసి అధ్యక్షులు జిన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి నివాస గేటుకు బీజేపీ పార్టీ జెండాలను కట్టారు, అదే విధంగా రాజకీయ వర్గాల మధ్య విబేధాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రచారం చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చినందున ఈ ఘటన కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో, సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఆయన
కోరారు.
BHARATH SAMACHAR DIGITAL
18, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్