భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

శోభన్ బాబుకు కాంగ్రెస్ ఘన సన్మానం

WhatsApp Image 2025-12-18 at 5.54.50 PM

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఏఐసీసీ ఆదివాసి కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్‌గా నియమితులైన భూక్య శోభన్ బాబుకు ఇనుగుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. పదవి పొందిన తర్వాత తొలిసారి మండలానికి వచ్చిన ఆయనను పూలమాలలు, శాలువాలతో గౌరవించారు.

ఈ సందర్భంగా శోభన్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కష్టపడే కార్యకర్తలను ఎల్లప్పుడూ గుర్తిస్తుందని, తన సేవలను గుర్తించి జాతీయ స్థాయి పదవి ఇవ్వడం గర్వకారణమని అన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, మండల అధ్యక్షుడు సతీష్, రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.