భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గ్రామంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి కొమ్ము శ్రీను గెలిస్తే కోతుల బెడదను తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొమ్ము శ్రీను విజయం సాధించిన వెంటనే గోవర్ధన్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారు.
గత రెండు రోజులుగా సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోతులను పట్టించి, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనితో అనంతారం గ్రామస్తులకు పెద్ద ఉపశమనం లభించింది. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన ఆయన కృషి పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.