భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి, సేంద్రీయ ఎరువులతో పంటలు పండించాలని జీవన్ ఆధార్ సొసైటీ ప్రతినిధి సాక్రుబాయి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లిలో మహిళా రైతులకు సేంద్రీయ సాగు, చిరుధాన్యాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. గోమూత్రం, ప్రకృతి సిద్ధమైన కషాయాలతో పంటలను సంరక్షించుకోవాలని ఆమె సూచించారు. చిరుధాన్యాల సాగు వల్ల భూసారం పెరగడమే కాకుండా, ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఏ టీం సభ్యులు అరుణ, సోమక్క, కవిత, పెద్ద సంఖ్యలో మహిళా రైతులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
20, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్