భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

గ్రామాల్లో పారదర్శక సేవలు అందించాలి: మురళీ నాయక్

WhatsApp Image 2025-12-20 at 5.20.43 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : గ్రామాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తూ, గ్రామాభివృద్ధికి నిబద్ధతతో కృషి చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా.భూక్య మురళీ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం గూడూరు మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో జరిగిన సర్పంచులు, ఉప సర్పంచుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజా ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యమత్యంతో పనిచేసి నియోజకవర్గంలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.