భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

షార్ట్ సర్క్యూట్‌తో పంచాయ‌తీ కార్మికుడి ఇల్లు దగ్ధం

WhatsApp Image 2025-12-20 at 5.44.51 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా : ఇనుగుర్తి మండల కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. గ్రామపంచాయతీలో సఫాయి వర్కర్ గా పనిచేస్తున్న పుర్రం బిక్షం పూరిగుడిసెకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న బిక్షం చిన్న కుమారుడిని చుట్టుపక్కల వారు గమనించి హుటాహుటిన బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని బియ్యం, బట్టలు, ఇతర సామగ్రి కాలిపోవడంతో సుమారు రూ. 25 వేల ఆస్తి నష్టం వాటిల్లింది.

 

రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం నిలువనీడ కోల్పోయి వీధిన పడింది. సమాచారం అందుకున్న తహసిల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ బషీర్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపి, ప్రభుత్వం నుండి తక్షణ సహాయం అందేలా చూస్తామని తహసిల్దార్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.