భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో గల బండల మల్లన్న జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆదివారం ఆలయ ప్రాంగణంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 3, 4వ తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
21, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్