భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో మానవత్వం చాటుకున్న ఉపసర్పంచ్

WhatsApp Image 2025-12-21 at 7.39.26 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా : ఇనుగుర్తి మండల కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయి వీధిన పడిన నిరుపేద కుటుంబానికి ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి అండగా నిలిచారు. గ్రామ పంచాయతీ వర్కర్ పుర్రం బిక్షం నివాసం ఉంటున్న గుడిసె శనివారం ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో, అందులోని సామాగ్రి అంతా దగ్ధమైంది.

 

తీవ్రమైన చలిలో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను గమనించిన ఉపసర్పంచ్ యాదగిరి, ఆదివారం వారికి దుప్పట్లు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మానవతా దృక్పథాన్ని చూసి గ్రామస్తులు యాదగిరిని అభినందించారు. ప్రభుత్వపరంగా కూడా బాధితులకు సాయం అందేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.