భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: ఇటీవల జరిగిన తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామపంచాయతీ సర్పంచ్ గా విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ధానావత్ వెంకట్రాం నాయక్, స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు ఎన్నికైన ఉపసర్పంచ్ వాంకుడోతు వీర నాయక్, గెలుపొందిన 10 మంది వార్డు సభ్యులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మాటూరు గ్రామ ప్రత్యేక అధికారి శశికళ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిపించగా, గ్రామ పంచాయతీ కార్యదర్శి రజియా సుల్తానా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. త్రిపురారం మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధానావత్ భాస్కర్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మర్ల చంద్రారెడ్డి, త్రిపురారం మండలం కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమళ్ళ బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస్ రెడ్డిలు విశిష్ట అతిథులుగా ఆహ్వానించబడ్డారు. ఈ కార్యక్రమంలో మాటూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధానావత్ హుస్సేన్ నాయక్, మాటూరు గ్రామ మాజీ సర్పంచ్ పాండు నాయక్, ఉపసర్పంచ్ ధానావత్ శంకర్ నాయక్, మాటూరు, డీలర్ రాములు నాయక్, యువనాయకులు ధానావత్ రతన్ నాయక్, కలకొండ శివశంకరమల్లయ్య, మిర్యాలగూడ 1104 యూనియన్ అదనపు కార్యదర్శి ధానావత్ మోతీలాల్ నాయక్, లైన్ మెన్ ధానావత్ శివ, రామావత్ రమేష్, ధానవత్ తులసిరాం, ధానావత్ కిషన్, ధానావత్ చంటి, ధానావత్ ముని, పోతుగంటి యల్లయ్య, గన్నేపాక లక్ష్మయ్య, వడ్డే యేసుతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
23, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్