భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్ణణంలో బుధవారం నిర్వహించిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసి రాష్ట్రంలో 4,000 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు ఎన్నుకున్నారని, రానున్న రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సర్పంచులను సన్మానించారు. పార్టీ కష్టకాలంలో నిలబడి పోరాడి గెలిచిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు పార్టీ అండగా నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
24, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్