భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి నేడు నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హాత్నూర మండలం గుండ్ల మాచనూరు గ్రామ సర్పంచ్ శ్రీహరి గార ఆధ్వర్యంలో గుండ్ల మాచనూరు గ్రామం నుంచి గణేష్ గడ్డ ఆలయం వరకు నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమాన్ని ఆవుల రాజిరెడ్డి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. కౌడిపల్లి మండలం హరిచంద్ తాండ గ్రామ సర్పంచ్ శాలీబాయి రవీందర్ నాయక్, ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ దుర్గా డిజిటల్స్ ఫోటో స్టూడియో షాప్ను ఆవుల రాజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇటీవల నూతనంగా గెలుపొందిన పలువురు సర్పంచులు ఆవుల రాజిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. మనోహరాబాద్ మండలం పరికిబండకు చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మచ్చ శ్రీరామ్, వారి మిత్ర బృందం ఆవుల రాజిరెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంక్షారెడ్డి , గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జి నర్సారెడ్డిల సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.