భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని సిరువోరు వాహిని డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘డీప్ న్యూరల్ నెట్ వర్క్ ఉపయోగించి క్లౌడ్ కంప్యూటింగ్ లో ఆప్టిమైజ్డ్ షెడ్యూలింగ్ కోసం ఇంటెలిజెంట్ లోడ్ బ్యాలెన్సింగ్’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న సీఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.అపర్ణ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. పెద్ద ఎత్తున క్లౌడ్ వాతావరణంలో డైనమిక్ పనిభారాలను నిర్వహించడంలో కీలకమైన సవాళ్లను ఈ అధ్యయనం ద్వారా డాక్టర్ వాహిని పరిష్కరించినట్టు తెలిపారు. డీప్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ పద్థతులను ఉపయోగించి మూడు స్థాయిల తెలివైన లోడ్ బ్యాలెన్సింగ్ ఫ్రేమ్ వర్కును ప్రతిపాదించడం ద్వారా, పనిభార అంచనా, వనరుల వినియోగం, శక్తి సామర్థ్యం, సేవ నాణ్యతను పెంచుతుందని వివరించారు. క్లౌడ్ సిమ్ ని ఉపయోగించే విస్తృతమైన అనుకరణలు ప్రతిస్పందన సమయం, శక్తి వినియోగం పనిభారంలో ఇప్పటికే ఉన్న విధానాల కంటే గణనీయమైన మెరుగుదలలను ప్రదర్శిస్తాయన్నారు.
డాక్టర్ వాహిని సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఆర్.శాస్త్రి, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.