భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం పాపన్నపేట మండలంలోని ఏడుపాయల దుర్గాభవాని మాతను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చైర్మన్ కు ఆలయ అధికారులు, పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో వనదుర్గా మాత కు ప్రత్యేక పూజలు చేసి శాలువా పూలమాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సరంలో మరింత ఆనందంగా ఉత్సాహంగా ఉంటూ ప్రజల కోరికలు నెరవేరాలని దుర్గామాతకు మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, స్థానిక తహసిల్దార్, ఆలయ ఈవో, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.