భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

అమీన్పూర్‌లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

65d91716-7aa8-4eca-8ae1-256f0bcc06a5

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా అమీన్‌పూర్‌లోని గాంధీ విగ్రహం వద్ద డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ సోమవారం పర్యటించారు. డివిజన్‌లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి, లోపాలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.