భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారులకు అండగా నిలుస్తూ క్రీడలపై తనకున్న మమకారాన్ని చాటుకుంటున్నారు. త్వరలో కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా జరగనున్న జాతీయస్థాయి ఖోఖో జూనియర్స్ పోటీలకు హాజరవుతున్న తెలంగాణ జట్టుకు లక్ష రూపాయలు సొంత నిధులచే 30 ట్రాక్ సూట్లను అందించారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులకు ట్రాక్ సూట్లను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖోఖో జూనియర్స్ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల నుంచి మెరుగైన ప్రదర్శనలతో జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ క్రీడలకు కేంద్రంగా పటాన్చెరుని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
30, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్