భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మండల పరిధిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలువురి కుటుంబాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంబాపూర్ బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చాకలి ప్రకాష్ తండ్రి చాకలి లక్ష్మయ్య ఆదివారం నాడు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లిన గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అదేవిధంగా దోమడుగు గ్రామానికి చెందిన జంగా హంసమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ బాధను తట్టుకునేలా దేవుడు శక్తినివ్వాలని కోరారు. దోమడుగులో ఆటోడ్రైవర్ మణిగండ్ల విష్ణు మృతి చెందడంతో వారి పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విష్ణు కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విష్ణు కుమారుడు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడని తెలుసుకుని, అతని ఉన్నత చదువులకు కావలసిన ఖర్చును తానే భరిస్తానని గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
30, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్