భారత్ సమాచార్, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, జిల్లాలోని మండల ఇంఛార్జీలతో నిర్వహించిన సమీక్ష సదస్సుకు ముఖ్యఅతిథులుగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల సూర్యాపేట జిల్లా ఇంఛార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన కృషి మరవలేనిదాని పేర్కొన్నారు.
అదేవిధంగా మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, అన్ని గ్రామాలలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ చైర్ పర్సన్స్ ప్రజాప్రతినిధులు ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎమ్మార్పీఎస్ కు అండగా నిలబడ్డ ప్రతి నాయకునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జీ పల్లెర్ల సుధాకర్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి, ఎంఎస్సీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.