భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

రోడ్డుపై డ్రైనేజీ నీరు.. పట్టించుకోరా సారూ

0c4f8ba7-ec02-4418-9811-2e26bdba81d3

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీసాయి వెంకటేశ్వర ఎంక్లేవ్ వెంచర్‌లోని ప్రధాన రోడ్డుపై మురుగు నీరు పైప్‌లైన్ పగిలి గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డుపై ప్రవహిస్తూ ఇండ్ల పరిసరాల్లో సైతం వచ్చి చేరుతోంది. దీంతో దోమల వ్యాప్తి దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రోడ్డు నుంచి పక్కనే ఉన్న రెండు విద్యాసంస్థల విద్యార్థులు, టీజేఆర్ నగర్ కాలనీవాసులు మురుగునీటితో నిండిన రోడ్డు నుంచే వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీరు పైప్‌లైన్ సరిచేయాలని స్థానికులు కోరారు.