భారత్ సమాచార్ నెట్, సంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం, భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి కాలనీలో అభివృద్ధి పనులు సందడిగా సాగుతున్నాయి. సుమారు రూ.1.43 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రాధాన్యత క్రమంలో అన్ని ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ పనులను అత్యంత వేగంగా, నాణ్యతతో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, సొసైటీ ప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు, బిఆర్ఎస్ నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.