భారత్ సమాచార్ నెట్, ప్రకాశం జిల్లా : మానవ సేవే మాధవ సేవ అన్న సంకల్పంతో పామూరులో రమణమ్మ మెమోరియల్ ట్రస్ట్, యువసముద్రం సహకారంతో పేదలకు ఉచిత భోజన వసతి కల్పిస్తోంది. వారం వారం ప్రతి శనివారం మధ్యాహ్నం ముమ్మీ డాడీ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు స్వయంగా పేదలకు భోజన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు పి.మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, పేదవారి ఆకలి తీర్చడంలో లభించే తృప్తి వెలకట్టలేనిదని అన్నారు.
ట్రస్ట్ సభ్యుడు పి.మాధవ రెడ్డి మాట్లాడుతూ.. ఒక డాలర్ విలువతో ఒకరి ఆకలి తీర్చవచ్చనే తృప్తి తమకు కలుగుతోందని, భవిష్యత్తులోనూ భోజన, వైద్య, విద్యా రంగాల్లో మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. స్థానికులు ట్రస్ట్ సభ్యుల సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నారు.