భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, జనవరి 2026, సోమవారంభారత్ సమాచార్

హామీల అమలులో రేవంత్ రెడ్డి విఫలం: వంటేరు ప్రతాప్‌రెడ్డి

eda7a19d-883b-4e0d-9939-bd7bae41584b

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేసిన దీక్షలో ఇచ్చిన హామీలు మరచారని, సీఎం రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గం గతంలో వర్గల్ ఇండస్ట్రియల్ లో భూసేకరణలో కేసీఆర్ ప్రభుత్వంలో పది లక్షల ఇస్తున్నారని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.60 లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తంకుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ గజ్వేల్ పర్యటనలకు వచ్చినప్పుడు వర్గల్ మండల రైతులతో పెద్ద ఎత్తున అడ్డుకొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు. గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కేసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తారని ముఖ్యమంత్రి మెప్పుకోసం రాజకీయ లబ్ధి కోసం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉందని గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

 

గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పొద్దున లేచి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లితే ఆఫీసు బాయ్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ ల వరకు చాలావరకు ఖాళీగా ఉన్నాయని అక్కడ వెళ్లి ధర్నాలు చేసి ఉద్యోగాలు చేయాలని ఎద్దేవా చేశారు. పదవుల కోసం తాపత్రయపడే గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు ఉద్యోగం మీద ఉన్న సోయి గజ్వేల్ అభివృద్ధి మీద లేదని మండిపడ్డారు.
మీరు చేసే ధర్నా ఎలా ఉందంటే ఆకాశానికి సున్నం వేసే విధంగా మీ వెర్రి వేషాలు ఉన్నాయని వంటేరు ప్రతాప్ రెడ్డి ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా మొన్నటి వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లకు పడిన గుంతలు కూడా పూడ్చలేదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిలో జీరోగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, అభివృద్ధి చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమయ్యారని మండిపడ్డారు. అభివృద్ధి చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.