భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, జనవరి 2026, సోమవారంభారత్ సమాచార్

మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తాం

51e65388-84f4-4a4e-a754-39a3bb06abed

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజల దూర భారాన్ని, ప్రజల సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం రేగోడు మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తామని, ప్రత్యేక అధికారిని నియమిస్తామని, ప్రజల దూర భారాన్ని, ప్రయాణ భత్యాల్ని, సమయాభావాన్ని తగ్గించడం కోసమే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేగోడు ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 47 దరఖాస్తుల స్వీకరించినట్లు తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని సమస్యలు పరిష్కరించి, పరిష్కారం కాని వాటిని రాతపూర్వకంగా ఫిర్యాదుదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. భూసమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో, పోలీసు పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలన్నారు. జిల్లాలోని ప్రతి మండల పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు.

 

రేగోడు మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని గ్రామస్తుల విన్నపాన్ని ‌ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా కలెక్టర్ పేర్కొన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి, ఆయా దరఖాస్తులు ఏ అధికారి స్థాయిలో ఉన్నాయో తెలిపే సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రజలు జిల్లా కార్యాలయాల చుట్టూ తీరగాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వారి సమస్యలకు పరిష్కారం దొరికేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుందని, ముఖ్యమంత్రితో కలెక్టర్లకు జరిగిన ముఖ్య సమావేశంలో మండల స్థాయిలో ప్రజా సమస్యల కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలనుసారమే మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని బలోపేతం కోసం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజల సమర్పించే ఫిర్యాదుల్లో రెండు రకాల ఫిర్యాదులు ఉంటాయని అందులో సమస్యల కోసం ఫిర్యాదులు, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వీటిని వేరువేరుగా పరిశీలించి శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రేగోడు ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్య అధికంగా ఉన్నందువల్ల వాటిని వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని పరిష్కరించని వాటిని రాతపూర్వక సమాధానం అందిస్తారని పేర్కొన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ అది తూచా తప్పకుండా ప్రజావాణి కార్యక్రమంలో హాజర అవ్వాలని ఆదేశించారు.
రేగోడు మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని గ్రామస్తుల విన్నపాన్ని ‌ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దత్తారెడ్డి, ఎంపీడీవో సీతారామమ్మ, మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.