భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జనవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

భార్యాభర్తలు ఆత్మహత్య

5ceebd34-6719-4d85-9ddc-866a477377ac

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిల్లాలోని ఐలాపూర్ చిన్న తండాలో భార్యాభర్తలు వేర్వేరుగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పెరవెల్లి గ్రామానికి చెందిన లాల్ శేఖర్(32), అనూష(25)లు రెండు సంవత్సరాలుగా ఐలాపూర్ చిన్న తండాలో నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు మూలంగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అనూష ఇదే గ్రామంలో తల్లిగారి ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా, లాల్ శేఖర్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.