భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జనవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

ప్లంబర్‌కు ఆర్థిక సాయం అందజేత

aa38af71-e30e-4f66-96d6-25d7f01432bd

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్లంబర్‌కు ఆర్థిక సాయం అందజేశారు. నంద్యాల నబీ నగర్ ఆర్చి సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుడు ఎస్.జలీల్ బాషా అనారోగ్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అసోసియేషన్ సభ్యులు ఐక్యమత్యంగా కలిసి రూ.33,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్ ఖాన్తో పాటు కమిటీ సభ్యులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా అందరూ ఐక్యంగా ఉండి పరస్పర సహాయ సహకారాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నబీ నగర్ కరీముల్లా, జాయింట్ కార్యదర్శి ఫారుక్ నగర్ కరిముల్లా, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు ఆమన్, సయ్యద్ అంజద్ ఖాన్, ఎస్. మహబూబ్ బాషా, రషీద్ భాషా, సద్దాం, రవి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.