భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరు పట్టణంలో చేపట్టిన రోడ్ల పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సామాజిక కార్యదర్శి మూలింటి చంద్రశేఖర్ కోరారు.
ఈ మేరకు బుధవారం రోడ్డు అండ్ రవాణా శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ప్రత్యేకంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనులు ఆలస్యం కావడంతో దుమ్ము, గుంతల సమస్య పెరిగిందని పేర్కొన్నారు. నాణ్యతతో పాటు వేగం కూడా అవసరమని ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రజా భద్రతకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు.ఈ విషయంపై ఇంజనీర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
8, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్