భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

క్రీడాపోటీలు నిర్వహించడం ఆదర్శనీయం: హరీశ్ రావు

d33fd5fb-d776-4733-86c1-4b66cea11bc2

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం ఆదర్శనీయమని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలకు ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు మాజీ మంత్రి హరీశ్ రావును కలిసి ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, యువతలో ఆత్మవిశ్వాసం, జట్టు భావన, ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందించడంలో క్రీడలకు ప్రాధాన్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తిగా సీజిఆర్ ట్రస్ట్ యువత కోసం క్రీడా పోటీలను నిర్వహించడం ఆదర్శనీయమని అభినందించారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. 12వ తేదీ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిన్నారం వెంకటేష్ గౌడ్, కుమార్ గౌడ్, సంతోష్ రెడ్డి, ట్రస్టు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.