భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మెట్టుశ్రీధర్

e89495d5-8a75-490a-959a-2a13ea017070

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డా.కూన వేణు గోపాల కృష్ణ, జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితిలో పనిచేయుటకు పటాన్ చెరు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకుడు మెట్టుశ్రీధర్, జిన్నారం మండల కేంద్రానికి చెందిన దళిత బహుజన, యువజన ఉద్యమ నాయకుడు దళిత రత్న డా.ఏర్పుల శ్రీనివాస్ లు వీరు ఇరువురు సమాజంలో సుధీర్ఘ కాలంగా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలతో సమాజ శ్రేయస్సుకోసం కంకణ బద్ధులై అనేక సామాజిక కార్యక్రమాలు తలపెడుతున్నందుకు, నేటి సమాజంలో యువతను సన్మార్గంలో తీసుకుపోవడం కోసం యువత అభ్యున్నతికి చేస్తున్న కార్యక్రమాల కృషిని పరిగణలోకి తీసుకొని వీరి సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితిని బలోపేతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో యువజన సంఘాల సమితిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయుటకు మెట్టుశ్రీధర్ ను తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా, దళిత రత్న డా.ఏర్పుల శ్రీనివాస్ ను తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేశారు.

 

ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్, డా.ఏర్పుల శ్రీనివాస్ మాట్లడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో యువజన సంఘాల సమితి బలోపేతం చేయడానికి మేము తలపెట్టిన సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ వారిని ఆహ్వానించి ఇరువురిని తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి బలోపేతానికి కృషి చేసేవిధంగా రాష్ట్ర స్థాయి ముఖ్య బాధ్యతలు అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితిని, జిల్లా , మండల గ్రామ స్థాయిలో యువజన సంఘాల సమితులను ఏర్పాటు చేసి యువతకు ప్రజలకు మరింత చేరువచేసి సంఘం బలోపేతానికి కృషి చేస్తామన్నారు. తాము తలపెట్టిన అనేక సామాజిక కార్యక్రమాల్ని ప్రజలకు ప్రభుత్వాలకు వివిధ పత్రికల ద్వారా పరిచయం చేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన వివిధ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.