భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్ చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. గత దశాబ్ది కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో రెండు వందలకు పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో గ్రామ సర్పంచ్ శాంతయ్య, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
11, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్