భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా: కౌతాళం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ఉరుకుంద ఈరన్న, బసప్ప తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు శ్రీ బసవేశ్వర టాకీస్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సామాజిక సేవలను, రాజకీయ పునర్నిర్మాణాన్ని స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సామాజిక, సాంస్కృతిక సభల ద్వారా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని నేతలు వెల్లడించారు.