భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, జనవరి 2026, సోమవారంభారత్ సమాచార్

వృద్ధాశ్రమంలో అన్నదానం

WhatsApp Image 2026-01-18 at 4.32.37 PM

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోనిలో వివేకానంద జయంతి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆవోపా, వామ్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జీవనజ్యోతి వృద్ధాశ్రమంలోని 68 మంది వృద్ధులకు అన్నదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో వంకదారు శ్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ.. స్వామి వివేకానందుని దేశభక్తి, ఎన్టీఆర్ చేసిన సామాజిక సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహనీయుల స్మారకార్థం సమాజ సేవలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకంటి రఘు, యాదగిరి వెంకటేశ్వర్లు, ప్రతాప్ ఈరన్న శెట్టి, రాజేష్ రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.