భారత్ సమాచార్.నెట్, తిరుపతి: ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ మధ్య స్పెషల్ ట్రైన్లను నడపనుంది. ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వచ్చే రెండు నెలలు 18 ప్రత్యేక రైళ్లు నడపున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఆగస్ట్ 3 నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఈ రైళ్లు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్లలో సెంకండ్ ఏసీ నుంచి జనరల్ కోచ్ల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
రైళ్ల వివరాలు ఇలా:
తిరుపతి-సాయినగర్ షిర్డీ రైలు నెంబర్ 07637: ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరనుంది ఈ రైలు. మరుసటి రోజు ఉదయం 10.45 నిమిషాలకు షిర్డీకి చేరుకుంటుంది. వచ్చే నెల ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ రైలు సర్వీసు అందుబాటులో ఉండనుంది.
షిర్డీ-తిరుపతి రైలు నెంబర్ 07638: ప్రతి సోమవారం రాత్రి 7.35 నిమిషాలకు షిర్డీ నుంచి బయలుదేరే ఈ రైలు మంగళవారం అర్థరాత్రి 1.30 నిమిషాలకు తిరుపతి చేరుతోంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29వ తేదీవ వరకు ఈ రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
ఇక ఈ స్పెషల్ ట్రైన్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, భాల్కి, ఉద్గిర్, లాతూర్, పర్లి, గంగఖేర్, పర్భని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సోల్, మన్మాడ్, కోపర్గావ్ స్టేషన్ల్లో ఆగనున్నాయి.