భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

జాతీయ అథ్లెటిక్ పోటీలకు అనుమాండ్ల సౌమ్య ఎంపిక

e780af94-c52f-4f17-9108-635eac9c593c

భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: యాచారం మండలం ధర్మన్నగూడ‌‌ గ్రామానికి చెందిన అనుమాండ్ల సౌమ్య 10 కీ.మీ‌లో జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికైంది. జనవరి 20న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 10 కిలోమీటర్ల పరుగు పందెంలో మహేంద్రహిల్స్ సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థిని అనుమాండ్ల సౌమ్య అద్భుత ప్రతిభ కనబరిచింది. ధర్మన్నగూడ గ్రామానికి చెందిన సౌమ్య సాధించిన ఈ ఘనతపై గ్రామస్థులు, కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తె జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో సౌమ్య తల్లిదండ్రులు అనుమాండ్ల లక్ష్మీ, కిష్టయ్య సంతోషం వ్యక్తం చేశారు. పట్టుదలతో శ్రమించి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి పేదింటి బిడ్డ ఎదగడంపై పలువురు అభినందించారు.

 

మరిన్ని కథనాలు: 

ధర్మన్నగూడలో ఘనంగా బోనాల వేడుకలు