భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఎగిరిన డ్రోన్.. పెరిగిన ఆత్మవిశ్వాసం: గీతం విద్యార్థుల డ్రోన్ ప్రయోగాలు

WhatsApp Image 2026-01-22 at 6.12.56 PM

భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న డ్రోన్ బూట్ క్యాంపు నాలుగో రోజు విద్యార్థుల ఉత్సాహం మధ్య కొనసాగింది. డ్రోన్ అసెంబ్లీపై పూర్తి అవగాహన పెంచుకున్న విద్యార్థులు, నిపుణుల సమక్షంలో ఏడు క్వాడ్ ఎక్స్ కాప్టర్లను స్వయంగా రూపొందించి విజయవంతంగా పరీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జీపీఎస్ ఆధారిత హెక్సాకాప్టర్లను ఎగరవేస్తూ అధునాతన నావిగేషన్, కంట్రోల్ సిస్టమ్స్‌పై ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందారు.

నానో డ్రోన్ల ద్వారా విమాన నియంత్రణ పద్ధతులను నేర్చుకోవడం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఈ శిక్షణ సైద్ధాంతిక పరిజ్ఞానానికి, వాస్తవ ప్రపంచ సాంకేతికతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తు వైమానిక సాంకేతికతపై విద్యార్థులు చూపిన ఉత్సుకతను పలువురు అభినందించారు.