భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

పసుపు రంగు మిర్చితో అధిక దిగుబడి

0870664e-d085-4d15-bc69-c8417711a1c6

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం పన్యాల గ్రామానికి చెందిన రైతు మనోహర్ గౌడ్ తనకున్న రెండు ఎకరాల పొలంలో మూడు సంవత్సరాలుగా పసుపు రంగు గల మిరపకాయల పంట సాగు చేస్తున్నాడు. తన పంట తెంపి వరంగల్ ఎనుముల వ్యవసాయ మార్కెట్ కు రెండు సంవత్సరాల క్రితం తీసుకెళ్లారు. మిర్చికి అనుహ్యాంగా ఒక క్వింటాకు రూ.42వేల చొప్పున రికార్డు ధర పలకడంతో మనోహర్ గౌడ్‌కు రూ. 3లక్షలకుపైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. పసుపురంగు గల మిర్చి పంటసాగుతో అధిక దిగుబడి వస్తుందని, నీళ్లు ఎంత విడిస్తే అంత పంట చేతికి వస్తుందని తెలిపారు. మరో 40 క్వింటళ్ల మిర్చిని ఇప్పుడు పండిస్తున్నానని, పండించిన మిర్చిని వరంగల్ ఎనుముల వ్యవసాయ మార్కెట్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.