భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

స్వచ్ఛత ప్రజలందరి సామూహిక బాధ్యత

29038cbe-5313-4357-a261-598679f5009b

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని, ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల మండలం కానాల గ్రామంలో “స్వచ్ఛ రథం” (చెత్త సేకరణ వాహనం) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్య అతిథులుగా హాజరై స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ.. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజలందరి సామూహిక బాధ్యత అని అన్నారు. గ్రామాల్లో చెత్త నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసి, స్వచ్ఛతను నిరంతరం కొనసాగించేందుకు స్వచ్ఛ రథాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సక్రమంగా సేకరించి శాస్త్రీయ విధానంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, పిట్టల అనీఫ్, లాయర్ బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్వో, ఎంపీడీవో, మండల అధికారులు పాల్గొన్నారు.