భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడికి చెంచు గిరిజన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కొమరం భీమ్ గౌరవ అధ్యక్షులు వై.ఆశీర్వాదం, టెస్ట్ బోర్డు నెంబర్ గుండ్ల గంగమ్మ వినతిపత్రం సమర్పించారు. మహాశివరాత్రి సమయంలో వేలాది మంది భక్తులు నల్లమల్ల అడవుల్లో కాలినడకన భక్తివేళ క్రమంగా వస్తారు. భక్తులకు మంచినీటి సదుపాయం, అల్పాహారం, తాత్కాలిక బస కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచన. భీముడు కోలు, ఊట కోనేరు ప్రాంతాల్లో నేల, నీటి పరిశుభ్రతను పరిగణించి భక్తులకు సౌకర్యం కల్పించాలి. కైలాస ద్వారం వద్ద మెడికల్ క్యాంపులు, ఎమర్జెన్సీ వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు రోడ్డు పక్కన నడిచే సమయంలో గాయాలుగా బాధపడకుండా మట్టి మరుగు వాహనం ఏర్పాటు చేయాలి. మేడారం జాతర సందర్భంగా స్వామి వస్త్రాలను చెంచు గిరిజనులకు అందించడానికి చర్యలు చేపడతారని, వారి హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే విధంగా పాలకమండలి చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. చెంచు గిరిజనుల అవగాహన కోసం సదస్సులు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి ప్రతినిధులు, కొమరం భీమ్ ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
25, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్